Suryanarayana: ఎన్టీఆర్ 'అడవి రాముడు' సినిమా నిర్మాత కన్నుమూత

Producer Suryanarayana passes away
  • అనారోగ్యంతో మరణించిన సూర్యనారాయణ!
  • శ్రీ సత్య చిత్ర బ్యానర్ పై అనేక చిత్రాలు నిర్మించిన వైనం
  • ఎన్టీఆర్ తో నిర్మించిన అడవి రాముడు బ్లాక్ బస్టర్
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాత ఏ.సూర్యనారాయణ కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. సూర్యనారాయణ శ్రీ సత్య చిత్ర బ్యానర్ లో తమ భాగస్వామి సత్యనారాయణతో కలిసి అనేక చిత్రాలు నిర్మించారు. వాటిలో ఎన్టీ రామారావుతో నిర్మించిన అడవిరాముడు చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. కొత్తపేట రౌడీ, ప్రేమ బంధం, భలే తమ్ముడు వంటి హిట్ చిత్రాలను నిర్మించారు. 

సూర్యనారాయణ నిర్మాణ సారథ్యంలో వచ్చిన కుమారరాజా చిత్రంలో కృష్ణ ట్రిపుల్ యాక్షన్ చేయడం విశేషం. ఈయన నిర్మించిన కొత్త అల్లుడు చిత్రంలో చిరంజీవి ప్రతినాయకుడిగా నటించారు. సూర్యనారాయణకు నిర్మాతగా చివరి చిత్రం అత్తా నీ కొడుకు జాగ్రత్త. ఇది 1997లో రిలీజైంది. ఇందులో జయసుధ, జయచిత్ర, ఉదయ్ బాబు, ప్రేమ, చంద్రమోహన్ తదితరులు నటించారు.
Suryanarayana
Demise
Producer
Adavai Ramudu
NTR
Tollywood

More Telugu News