Twinkle Khanna: పిల్లలను కనడానికి ముందు ట్రైనింగ్ అవసరం అంటున్న ట్వింకిల్ ఖన్నా

Twinkle Khanna says parents need training before having kids just how you get license to drive after passing a test
  • వాహనం నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ మాదిరేనన్న ట్వింకిల్
  • పేరెంటింగ్ కు కూడా శిక్షణ అవసరమని సూచన
  • కుమారులను సైతం సరైన విధంగా పెంచాలన్న అభిప్రాయం
మాజీ నటి ట్వింకిల్ ఖన్నా పిల్లల విషయంలో కాబోయే తల్లిదండ్రులకు ముఖ్యమైన సూచన చేశారు. ‘‘ఒక వాహనం నడిపే ముందు దానిపై శిక్షణ తీసుకుని, పరీక్ష పాస్ అయి, లైసెన్స్ తీసుకుంటాం కదా. అచ్చం అదే మాదిరి పిల్లలను కనే ముందు వారిని ఎలా పెంచాలనే విషయమై శిక్షణ తీసుకోవడం ఎంతో అవసరం’’ అని తన స్వీయ అనుభవం నుంచి ట్వింకిల్ ఖన్నా సూచన చేశారు. 

ట్వింకిల్ ఖన్నా నటుడు అక్షయ్ కుమార్ భార్య అన్న సంగతి తెలిసిందే. వీరికి ఆరవ్, నితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పేరెంటింగ్ గురించి ట్వింకిల్ తరచూ మాట్లాడుతుంటారు. ఆమె ఇప్పుడు రచనలు సైతం చేస్తోంది. ఇటీవలే ముంబైలో ఆటో నడిపి ఆమె వార్తలకెక్కారు. ‘‘కుమార్తెల పెంపకంపైనే దృష్టి సారించడం కాదు, కుమారులను సరైన మార్గంలో ఎలా పెంచాలనే దానిపై నేను ఇటీవలే కాలమ్ రాశాను. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎలా అయితే శిక్షణ తీసుకుని పరీక్ష పాస్ అవుతామో, పేరెటింగ్ కు ముందు ఈ విషయంలోనూ శిక్షణ అవసరం’’ అని ఆమె చెప్పారు.
Twinkle Khanna
parenting
training
driving licence

More Telugu News