khalistan: ఢిల్లీనే మా టార్గెట్.. ఉగ్రదాడి చేస్తాం.. ఎస్ఎఫ్ జే టెర్రరిస్టు హెచ్చరికలు

pro khalistan group issues terror threat ahead of republic day

  • వీడియో రిలీజ్ చేసిన ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను
  • ఎర్రకోటపై ఖలిస్తాన్ జెండా ఎగురవేసిన వాళ్లకు 5 లక్షల డాలర్లు ఇస్తానని ఆఫర్
  • 2023లో భారతదేశం నుంచి పంజాబ్ కు విముక్తి కల్పిస్తానని ప్రకటన

గణతంత్ర దినోత్సవం రోజున ఉగ్రవాద దాడులకు పాల్పడుతామంటూ ప్రత్యేక ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ, నిషేధిత సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే)  ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను హెచ్చరికలు జారీ చేశాడు. ‘‘జనవరి 26న ఇళ్లలోనే ఉండండి.. ఢిల్లీనే మా టార్గెట్.. ఖలిస్తాన్ జెండాను మేం ఎగురవేస్తాం’’ అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

‘‘2023లో భారతదేశ ఆక్రమణ నుంచి పంజాబ్ కు విముక్తి కల్పిస్తా’’నని అందులో చెప్పాడు. పైగా ఎర్రకోటపై ఖలిస్తాన్ జెండా ఎగురవేసిన వాళ్లకు 5 లక్షల డాలర్ల (సుమారు 4 కోట్ల రూపాయలు) ను ఇస్తానని ప్రకటించాడు. ఈ వీడియోపై స్పందించిన లాయర్ వీనీత్ జిందాల్.. ఎస్ఎఫ్ జే,  గురుపత్వంత్ సింగ్ పన్నుపై సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఎస్ఎఫ్ జే, గురుపత్వంత్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. 

గురుపత్వంత్ సింగ్ ను ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. సిక్ ఫర్ జస్టిస్ సంస్థను నిషేధించింది. విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని, దేశంలో శాంతికి విఘాతం కలిగించడానికి కుట్ర పన్నారని పంజాబ్ పోలీసులు అతడిపై గత ఏడాది కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News