Novak Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఎదురులేని జకోవిచ్

Novak Djokovic rams into quarterfinals in Australian Open
  • నేడు నాలుగోరౌండ్ మ్యాచ్ ఆడిన జకోవిచ్ 
  • ఆసీస్ ఆటగాడు మినౌర్ పై ఘనవిజయం
  • వరుస సెట్లలో మినౌర్ ను చిత్తుచేసిన జకో
  • క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సెర్బియా స్టార్
మాజీ వరల్డ్ నెంబర్ వన్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. ఇవాళ జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ డి మినౌర్ ను జకోవిచ్ అత్యంత సునాయాసంగా ఓడించాడు. కేవలం రెండు గంటల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో జకోవిచ్ 6-2, 6-1, 6-2తో స్థానిక ఆటగాడు మినౌర్ ను చిత్తుగా ఓడించాడు. ఈ విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 

మ్యాచ్ విషయానికొస్తే జకో జోరు ముందు మినౌర్ ఏమాత్రం నిలవలేకపోయాడు. అసలు, ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయాడు. పలుమార్లు మినౌర్ సర్వీసును బ్రేక్ చేసిన జకోవిచ్ వరుసగా మూడు సెట్లను చేజిక్కించుకుని జయభేరి మోగించాడు.

గత రెండు మ్యాచ్ ల్లో కండరాల గాయం బాధించినప్పటికీ, ఈ మ్యాచ్ లో మాత్రం జకోవిచ్ విజృంభణకు అడ్డే లేకుండా పోయింది. కాగా, బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో జకోవిచ్... ఆండ్రీ రుబ్లెవ్ తో తలపడనున్నాడు.
Novak Djokovic
Australian Open
Alex De Minaur
Quarterfinals
Melbourne

More Telugu News