Chandrababu: 'నాటు నాటు' పాటకు ఆస్కార్ నామినేషన్ దక్కడంపై చంద్రబాబు స్పందన

Chandrababu responds to Naatu Naatu song getting nomination for Oscar original song category
  • నేడు ఆస్కార్ నామినేషన్ల ప్రకటన
  • ఆర్ఆర్ఆర్ టీమ్ కు అభినందనలు తెలిపిన టీడీపీ అధినేత
  • ఆస్కార్ తప్పకుండా తీసుకురావాలని పిలుపు
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ నాటు నాటు పాటకు ఆస్కార్ నామినేషన్ లభించడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. 

సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు రాజమౌళి, గీత రచయిత చంద్రబోస్, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు, యావత్ చిత్రబృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ సాధించారని, అలాగే ఆస్కార్ ను కూడా తప్పకుండా తీసుకువస్తారని భావిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

ఆస్కార్ బరిలో ఐదు పాటలు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో స్థానం దక్కించుకోగా, అందులో నాటు నాటు పాట కూడా ఒకటి. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించిన ఈ పాట ఆస్కార్ నామినేషన్ ఖరారు చేసుకోవడం ఖాయమని విదేశీ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. ఇప్పుడవే నిజమయ్యాయి.
Chandrababu
Naatu Naatu
Oscar
Nomination
Original Song

More Telugu News