Somu Veerraju: జనసేనతో పొత్తులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు: సోము వీర్రాజు

Somu Veerraju says no confusion on alliance with Janasena
  • కొంతకాలంగా జనసేన, బీజేపీ మధ్య ఎడం
  • బీజేపీతో పొత్తులోనే ఉన్నామన్న పవన్ కల్యాణ్
  • ఇద్దరం క్లారిటీతో ఉన్నామన్న సోము వీర్రాజు
ఏపీలో బీజేపీ, జనసేన మధ్య కొంతకాలంగా ఉమ్మడి కార్యాచరణ అంటూ ఏమీ కనిపించడంలేదు. దాంతో రెండు పార్టీల మధ్య భాగస్వామ్యం ఉందా? లేదా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. 

ఇవాళ కొండగట్టులో వారాహి వాహనానికి పూజలు చేసిన సందర్భంగా, పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఏపీలో బీజేపీతో జనసేన పొత్తులోనే ఉందని స్పష్టం చేశారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా పవన్ వ్యాఖ్యలను బలపరిచారు. 

బీజేపీతో పొత్తులోనే ఉన్నాం అంటూ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారని, పొత్తులపై తామిద్దరం క్లారిటీతో ఉన్నామని సోము వీర్రాజు వెల్లడించారు. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని స్పష్టం చేశారు. 

ఈ మధ్యాహ్నం జరిగిన ఓ కార్యక్రమంలో, తమ పొత్తు ప్రజలతోనే అని స్పష్టం చేసిన సోము వీర్రాజు... పవన్ వ్యాఖ్యల అనంతరం తన మాటలను సవరించుకోవడం గమనార్హం. జనసేన, బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతుందని అన్నారు.
Somu Veerraju
Pawan Kalyan
Alliance
BJP
Janasena
Andhra Pradesh

More Telugu News