Jamuna: మహాప్రస్థానంలో ముగిసిన నటి జమున అంత్యక్రియలు

Senior actress Jamuna last rites completed
  • అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన జమున
  • అమెరికాలో ఉన్న కుమారుడు వచ్చేందుకు మరింత సమయం
  • జమునకు అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తె
  • నివాళులు అర్పించిన ఏపీ మంత్రి రోజా
అలనాటి మేటి నటి జమున ఇవాళ కన్నుమూసిన సంగతి తెలిసిందే. 86 ఏళ్ల జమున కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా, ఈ సాయంత్రం నగరంలోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో జమున అంత్యక్రియలు నిర్వహించారు. జమునకు కుమార్తె స్రవంతి రావు అంతిమసంస్కారాలు జరిపారు. విదేశాల నుంచి జమున కుమారుడు వచ్చేందుకు సమయం పడుతుండడంతో, కుమార్తె అంత్యక్రియలు నిర్వహించారు. 

కాగా, మహాప్రస్థానంలో జమునకు మా అసోసియేషన్ సభ్యులు జీవిత, కరాటే కల్యాణి, మాదాల రవి తదితరులు నివాళులు అర్పించారు. సీనియర్ నటుడు మురళీమోహన్, నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి, ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి కూడా జమునకు కడసారి వీడ్కోలు పలికారు. 

ఇక ఏపీ మంత్రి రోజా చివరి నిమిషంలో వచ్చి జమునకు నివాళులు అర్పించారు. టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ జమున కుమార్తె స్రవంతిరావును పరామర్శించారు.
Jamuna
Actress
Demise
Hyderabad

More Telugu News