Novak Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఫైనల్లోకి దూసుకెళ్లిన జకోవిచ్

Djokovic reached final in Australian Open
  • సెమీస్ లో టామీ పాల్ పై విజయం
  • వరుస సెట్లలో గెలిచిన జకోవిచ్
  • ఫైనల్లో సిట్సిపాస్ తో ఢీ
  • ఫైనల్ గెలిస్తే జకోకు టైటిల్ తో పాటు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకు
మాజీ వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఫైనల్లోకి ప్రవేశించాడు. మెల్బోర్న్ లో ఇవాళ జరిగిన సెమీఫైనల్లో సెర్బియా స్టార్ జకోవిచ్ 7-5, 6-1, 6-2తో అమెరికా ఆటగాడు టామీ పాల్ ను చిత్తుచేశాడు. 

తొలి సెట్ లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన చవిచూసిన జకోవిచ్... చివరి రెండు సెట్లలో జూలు విదిల్చాడు. టామీ పాల్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో మట్టికరిపించాడు. 

కాగా, జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఫైనల్ చేరడం ఇది పదోసారి. జకో ఫైనల్లో జకోవిచ్ గ్రీకు వీరుడు స్టెఫానో సిట్సిపాస్ తో తలపడనున్నాడు. అంతకుముందు జరిగిన మరో సెమీఫైనల్లో సిట్సిపాస్ 18వ సీడ్ రష్యన్ ఆటగాడు కరెన్ కచనోవ్ పై 7-6, 6-4, 6-7, 6-3తో నెగ్గాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో జకోవిచ్ నెగ్గితే టైటిల్ తో పాటు వరల్డ్ నెంబర్ ర్యాంకు లభిస్తుంది.
Novak Djokovic
Final
Australian Open
Stefano Tsitispas

More Telugu News