Prabhas: మాతో ప్రభాస్ ఎలా ఉంటారంటే..!: కాలభైరవ
- కీరవాణి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన కాలభైరవ
- సంగీత దర్శకుడిగా .. సింగర్ గా మంచి గుర్తింపు
- కీరవాణిగారి వల్లనే ఫస్టు ఛాన్స్ వచ్చిందని వెల్లడి
- తన టాలెంటుతో నిలబడ్డానని వ్యాఖ్య
కీరవాణి తనయుడిగా కాలభైరవ తన వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. కీరవాణి మాదిరిగానే కాలభైరవ కూడా మంచి గాయకుడు. 'ఆర్ ఆర్ ఆర్'లో ఆయన పాడిన 'నాటు నాటు' పాటకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తన కెరియర్ గురించి ప్రస్తావించాడు.
"మొదటి నుంచి కూడా నాకు సంగీతం అంటే ఇష్టం .. తమ్ముడు 'సింహా'కు యాక్టింగ్ అంటే ఇష్టం. అందువలన ఎవరికి నచ్చిన దారిలో వాళ్లం వెళుతున్నాము. 'ఆర్ ఆర్ ఆర్'లో నేను పాడిన పాటకు లభించిన గౌరవం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. 'బాహుబలి'లో కూడా నేను 'దండాలయ్యా' పాటను సరదాగా పాడాను. బాబాయ్ కి నచ్చేసి అదే ఉంచేయమన్నారు.
మా ఫ్యామిలీతో ప్రభాస్ చాలా సరదాగా ఉంటారు. 'బాహుబలి' షూటింగులో నేను .. ప్రభాస్ ఫ్రెండ్లీగా మాట్లాడుకునేవాళ్లం. పరిచయం ఉంటే ఆయన చాలా చనువు తీసుకుని మాట్లాడతారు. లేదంటే చాలా తక్కువ మాట్లాడతారు. సంగీత దర్శకుడిగా నేను చేసిన మొదటి సినిమా 'మత్తు వదలరా'. నేను కీరవాణిగారు కొడుకునీ .. చిన్నప్పటి నుంచి సంగీతం మధ్యంలో పెరిగినవాడిని కనుకనే నాకు ఛాన్స్ ఇచ్చారు. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నా టాలెంటుతో నిలబడ్డాను" అంటూ చెప్పుకొచ్చాడు.