Nara Lokesh: తాడేపల్లి ప్యాలస్ లో ఈ నలుగురు మాత్రమే ఉంటారు: నారా లోకేశ్

Lokesh fires on Jagan in padayatra

  • కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్ర
  • జగన్ చెప్పేదొకటి, చేసేది మరొకటి అంటూ లోకేశ్ విమర్శ
  • ఓట్లు అడిగేందుకు వైసీపీ నేతలు వచ్చినప్పుడు నిలదీద్దామని వ్యాఖ్య

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. యాత్రలో ఆయన ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరిస్తున్నారు. మరోవైపు మధ్యలో నిర్మాణాలను నిలిపివేసిన కురుబ, వాల్మీకి వర్గాలకు చెందిన కమ్యూనిటీ హాల్స్ ను ఆయన పరిశీలించారు. ఈ భవనాలను పూర్తి చేయాలని అధికారులను కోరినా అధికారులు పట్టించుకోలేదని వారు లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... వైసీపీ నేతలపై మండిపడ్డారు. వైసీపీ నేతలు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటారని... కానీ, వారు చేసేది సామాజిక అన్యాయమని విమర్శించారు. టీడీపీ హయాంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పేదొకటి, చేసేది మరొకటని దుయ్యబట్టారు. తాడేపల్లి ప్యాలస్ లో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక దొంగరెడ్డి, ఉత్తరాంధ్రను దోచుకునే మరో రెడ్డి ఉంటారని అన్నారు. ఈ నలుగురు మాత్రమే తాడేపల్లి ప్యాలస్ లో ఉంటారని... వైసీపీ బీసీ నేతలు మాత్రం గేటు బయటే ఉంటారని చెప్పారు. ప్రజలకు కావాల్సినవి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. రేపు ఓట్లు అడిగేందుకు వైసీపీ నేతలు వచ్చినప్పుడు నిలదీద్దామని చెప్పారు.

  • Loading...

More Telugu News