Andhra Pradesh: శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ఏపీ ప్రభుత్వం రెడీ!

AP Assembly Budget Session Likely In March 3rd Week
  • ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించాలని తొలుత నిర్ణయం
  • మార్చి 3,4 తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్
  • అది ముగిశాక మూడో వారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు
శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించి  22 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే, ఇప్పుడు వీటిని మార్చికి జరిపినట్టు తెలుస్తోంది. 

మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్టణంలో గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మార్చి రెండో వారంలో సమావేశాలను మొదలుపెట్టి మూడోవారం చివర్లో ముగించాలని భావిస్తున్నట్టు సమాచారం.
Andhra Pradesh
Assembly Meetings
Global Investors Summit
Visakhapatnam

More Telugu News