Ambati Rambabu: సినిమాలతో చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఉన్నారు.. రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు: అంబటి

Chiranjeevi Busy In Movies He wont come into politics Says Ambati
  • రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రశ్నే లేదన్న అంబటి
  • వచ్చే ఎన్నికల్లో వైసీపీదే గెలుపని ధీమా 
  • లోకేశ్ పాదయాత్ర వెలవెలబోతోందన్న మంత్రి
మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారన్న వార్తలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. సినిమాల్లో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారని, రాజకీయాల్లోకి రావాలని ఆయన అనుకోవడం లేదని పేర్కొన్నారు. అలాగే, వైసీపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందన్న వార్తలపైనా అంబటి స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశమే లేదని స్పష్టం చేశారు. 

‘ముందస్తు’ పేరుతో ప్రతిపక్షాలు వారి పార్టీలో సీట్ల కోసం నాయకులను నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎంతమంది కలిసి పోటీ చేసినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. ఇక, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర వెలవెలబోయిందని మంత్రి అంబటి అన్నారు.
Ambati Rambabu
Mega Star Chiranjeevi
Nara Lokesh
YSRCP
TDP

More Telugu News