Punjab: పంజాబ్ లో ఇక భూమి నుంచి నీరు తోడితే పన్ను
- అంతరించిపోతున్న బూగర్భ జలవనరులు
- పరిస్థితి దారుణంగా మారకుండా ప్రభుత్వం కొత్త చర్యలు
- ఇళ్లల్లో తాగు, ఇతర అవసరాలు, సాగు అవసరాలకు మినహాయింపు
పంజాబ్ ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. భూగర్భ జలాన్ని కాపాడేందుకు వీలుగా కొత్తగా పన్ను విధానాన్ని ప్రవేశపెట్టనుంది. భూమి నుంచి నీరు తోడితే పన్ను వసూలు చేయనుంది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తోంది. ఇందుకు సంబంధించి పంజాబ్ రాష్ట్ర నీటి నియంత్రణ, అభివృద్ధి యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేసింది.