Inflammation: మీరు ఇన్ ఫ్లమ్మేషన్ బాధితులా..? ఈ ఆహారం అవసరం

fight Inflammation with these steps

  • బెర్రీ పండ్లు, చేపలు, బ్రొక్కోలీ, ఆలివ్ ఆయిల్ తో మంచి ఫలితం
  • రోజూ వ్యాయామం చేస్తూ, బరువును నియంత్రణలో పెట్టుకోవాలి
  • ఒత్తిడి తగ్గించుకుని, తగినంత నిద్రపోవాలి

దీర్ఘకాలం పాటు, తక్కువ మోతాదులో ఇన్ ఫ్లమ్మేషన్ మన శరీరంలో కొనసాగినా అది సైలెంట్ కిల్లర్ గా మారుతుందని, గుండె జబ్బులు, కేన్సర్, టైప్ 2 మధుమేహం ఇతర సమస్యలకు కారణమవుతుందని సైన్స్ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా మరణించే ప్రతి ఐదుగురిలో ముగ్గురు ఇన్ ఫ్లమ్మేషన్ కారణంగా ఏర్పడిన అనారోగ్య సమస్యల వల్లే కావడం గమనార్హం. హార్వర్డ్ మెడికల్ స్కూల్ దీనిపై ఓ నివేదికను విడుదల చేసింది. అవసరమైతే జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని, వైద్య పరమైన పరిష్కారాలతో అయినా ఇన్ ఫ్లమ్మేషన్ కు చెక్ పెట్టాలని సూచించింది. 

ఆహారం
బెర్రీలు, బ్లూ బెర్రీలు, బ్లాక్ బెర్రీలు, రాస్ బెర్రీలతో మంచి ఫలితం ఉంటుంది. సాల్మన్, శార్డినెస్, హెర్రింగ్, మాకెరెల్, యాంకోవీస్ చేపలను తినాలి. బ్రొక్కోలీ, అవకాడో, గ్రీన్ టీ, మిరియాలు, మష్ రూమ్, ద్రాక్ష, పసుపు, ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, డార్క్ చాక్లెట్, టమాటా, చెర్రీలను తప్పకుండా తీసుకోవాలి.

వ్యాయామం
రోజులో తప్పకుండా 30-40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. వేగవంతమైన నడక లేదంటే ఏరోబిక్ వ్యాయామాలు మంచి ఫలితాన్నిస్తాయి.

తగినంత నిద్ర
నిద్రకు ప్రాధాన్యం ఎంతో ఉంది. నిద్ర తగ్గడం వల్ల శక్తి తగ్గిపోవడమే కాదు.. ఇన్ ఫ్లమ్మేషన్ పెరిగేందుకు కారణమవుతుంది. గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో హాని చేస్తుంది. నిద్ర తగ్గడం వల్ల ప్రధానంగా గుండె జబ్బులు, మధుమేహం సమస్యల బారిన పడతారు.

పొగతాగడం
పొగతాగే అలవాటు కూడా ఇన్ ఫ్లమ్మేషన్ కు కారణమవుతుంది. కనుక ఈ అలవాటను వెంటనే మానుకోవడం అవసరం.

ఆల్కహాల్
మద్యపానానికి దూరంగా ఉండాలి. పరిమిత మోతాదు అంటే ఏమీ లేదు. చుక్క ఆల్కహాల్ కూడా కేన్సర్ మహమ్మారికి ఆహ్వానం పలికినట్టు అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికను గుర్తు తెచ్చుకోవాలి. 

ఒత్తిడి
శారీరక, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఇందుకు యోగ, మెడిటేషన్ మంచి ఫలితమిస్తాయి. ఒత్తిడి పెరిగిపోతే అది గుండె జబ్బులు, మధుమేహం, రమటాయిడ్ ఆర్థరైటిస్ కు కారణమవుతుంది. అందుకుని ఒత్తిడిని తగ్గించుకోవాలి. 

బరువు తగ్గాలి
అధిక బరువు ఎన్నో అనర్థాలకు కారణమవుతుంది. అందులో ఇన్ ఫ్లమ్మేషన్ కూడా ఒకటి. అందుకుని పరిమితికి మించి అదనంగా ఉన్న బరువును ఆహారం పరమైన మార్పులు, శారీరక వ్యాయామం ద్వారా తగ్గించుకోవాలి.

  • Loading...

More Telugu News