Karna Prayag: ఉత్తరాఖండ్ లో మరో రెండు నగరాల్లోనూ ఇళ్లకు పగుళ్లు

Two more cities in Uttarakhand suffered with cracks in houses

  • జోషిమఠ్ లో భూమి కుంగుబాటు.. ఇళ్లకు పగుళ్లు
  • ఇప్పుడు రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్ నగరాల్లోనూ అదే పరిస్థితి
  • ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్న ప్రజలు

ఇటీవల ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ లో ఇళ్లకు పగుళ్లు ఏర్పడడమే కాకుండా, భూమిలోకి కుంగిపోతుండడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అయితే, ఈ పరిస్థితి ఒక్క జోషిమఠ్ కు మాత్రమే కాదు, ఉత్తరాఖండ్ లోని మరో రెండు నగరాల్లోనూ కనిపిస్తోంది. కర్ణప్రయాగ్, రుద్రప్రయాగ్ నగరాల్లోనూ ఇళ్లు బీటలు వారుతున్నాయి. గోడలకు భారీగా పగుళ్లు ఏర్పడి ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. 

ఇప్పటికే ఆ రెండు నగరాల్లో కొన్ని కట్టడాలు కూలిపోయినట్టు తెలిసింది. దాంతో ప్రజలు భయాందోళనలకు గురవుతూ, ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. రిషికేశ్-కర్ణప్రయాగ్ నగరాల మధ్య రైలు మార్గంలో ఓ భారీ టన్నెల్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ టన్నెల్ నిర్మాణం కోసం కొండరాళ్లను పేల్చివేస్తున్నారు. కర్ణప్రయాగ్, రుద్రప్రయాగ్ నగరాల్లో ఇళ్ల పగుళ్లకు ఈ పేలుళ్లే కారణమని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News