K Kavitha: ఈ బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు కాదు... కొన్ని రాష్ట్రాలకే: కవిత విమర్శలు

Kalvakuntla Kavitha criticizes union budget

  • పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం
  • ఆర్థికమంత్రి ప్రకటించిన రిబేటుతో ఎవరికీ ఉపయోగం లేదన్న కవిత
  • తెలంగాణలో ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇస్తున్నామని వెల్లడి
  • మోదీ సర్కారు వైఫల్యానికి ఈ బడ్జెట్టే నిదర్శనం అని వ్యాఖ్యలు

కేంద్ర వార్షిక బడ్జెట్ 2023-24పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఆర్థికమంత్రి ప్రకటించిన పన్ను రిబేటుతో ఎవరికీ ఉపయోగంలేదని, ఎందుకంటే తెలంగాణలో ఉద్యోగులకు మెరుగైన వేతనాలు అందిస్తున్నామని తెలిపారు. రూ.10 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు కల్పిస్తారని ఆశించామని పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న మోదీ సర్కారు విఫలమైందనడానికి ఈ బడ్జెట్టే నిదర్శనం అని కవిత విమర్శించారు.

నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు కాదని, కొన్ని రాష్ట్రాలకేనని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించేలా బడ్జెట్ ఉందని ఆమె ఆరోపించారు.

  • Loading...

More Telugu News