K Viswanath: ముగిసిన కె.విశ్వనాథ్ అంత్యక్రియలు

K Viswanath last rites completed
  • గత అర్థరాత్రి కన్నుమూసిన కె.విశ్వనాథ్
  • నేడు పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు
  • ఫిలింనగర్ నివాసం నుంచి అంతిమయాత్ర
  • భారీగా తరలివచ్చిన అభిమానులు
వెండితెర కళాతపస్వి కె.విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. గత అర్ధరాత్రి హైదరాబాదులో కె.విశ్వనాథ్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కె.విశ్వనాథ్ భౌతికకాయానికి ఈ మధ్యాహ్నం పంజాగుట్ట శ్మశానవాటికలో సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీ ప్రముఖులు తరలివచ్చారు. 

అంతకుముందు, ఫిలింనగర్ లోని ఆయన నివాసం నుంచి పంజాగుట్ట శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు. తెలుగు జాతి గర్వించదగ్గ దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ కు కడసారి వీడ్కోలు పలికేందుకు అభిమానులు భారీ సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు.
K Viswanath
Last Rites
Demise
Hyderabad
Tollywood

More Telugu News