Kotamreddy Sridhar Reddy: వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి బెదిరింపులు.. వైరల్ అవుతున్న ఆడియో!

Kotamreddy Sridhar Reddy Getting Warning Calls Audio Goes Viral In Social Media
  • కోటంరెడ్డికి ఫోన్ చేసి బెదిరించిన కడప జిల్లాకు చెందిన అనిల్
  • జగన్ జోలికొస్తే బండికి కట్టుకుని నెల్లూరు అంగళ్ల మధ్య నుంచి లాక్కెళ్తానని హెచ్చరిక
  • నీ కథ మొత్తం నాకు తెలుసంటూ బెదిరింపులు
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కడప జిల్లాకు చెందిన బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆడియో ప్రకారం.. ‘జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ పెద్దల జోలికొస్తే బండికి కట్టుకుని నెల్లూరు అంగళ్ల మధ్య నుంచి లాక్కెళ్తా. కడప నుంచి నెల్లూరు ఎంతో దూరంలో లేదు. ఐదు నిమిషాల్లో వచ్చి లాక్కెళ్తా అని కోటంరెడ్డిని బోరుగడ్డ అనిల్ హెచ్చరించాడు. 

తనకు తాను వైసీపీ మద్దతుదారుడిగా చెప్పుకున్న అనిల్.. ‘నీ కథ మొత్తం నాకు తెలుసు. నీ తమ్ముడు కూడా నీ కంటే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. మీ ఇద్దరినీ ప్రజలు తరిమికొడతారు. డేట్ ఫిక్స్ చేసుకో. నీ ఇంటికి వచ్చి కట్టుకుని పోతా’ అని తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. ముఖ్యమంత్రిని తాను ఏమీ అనలేదని ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా అనిల్ బెదిరింపులకు దిగాడు. ఈ విషయం చెబుతూ కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Kotamreddy Sridhar Reddy
YSRCP
Nellore District
Kadapa District

More Telugu News