Sunny Leone: సన్నీ లియోన్ పాల్గొనాల్సిన ఈవెంట్ కు సమీపంలో శక్తిమంతమైన పేలుడు

Explosion near Sunny Leon fashion show
  • మణిపూర్ రాజధానిలో శక్తిమంతమైన పేలుడు
  • ఫ్యాషన్ షో వేదికకు 100 మీటర్ల దూరంలో పేలుడు
  • ఇంఫాల్ లో భారీగా భద్రతా బలగాల మోహరింపు
మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో శక్తిమంతమైన పేలుడు చోటుచేసుకుంది. బాలీవుడ్ భామ సన్నీ లియోన్ పాల్గొనే ఓ ఫ్యాషన్ ఈవెంట్ వేదికకు 100 మీటర్ల దూరంలోనే ఈ పేలుడు జరిగింది. హట్టా కాంగ్జీబంగ్ ప్రాంతంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సన్నీ లియోన్ రేపు ఆదివారం హాజరు కావాల్సి ఉంది.

 కాగా, పేలుడు ఘటనలో ఎవరికీ ప్రాణహాని జరగకపోడంతో అధికారవర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ దాడికి తమదే బాధ్యత అని ఇంకా ఏ తీవ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు. పేలుడు నేపథ్యంలో, ఇంఫాల్ లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఇలాంటి పరిస్థితుల్లో, ఫ్యాషన్ ఈవెంట్ కు సన్నీ హాజరవుతుందా? అనే అంశంపై అనిశ్చితి నెలకొంది.
Sunny Leone
Fashion Show
Explosion
Imphal
Manipur

More Telugu News