Karnataka: ఇవే నా చివరి ఎన్నికలు.. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య

Upcoming polls will be my last election says former Karnataka CM Siddaramaiah

  • వచ్చే ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తానన్న సిద్ధరామయ్య
  • రాజకీయాల నుంచి రిటైర్ కాబోనని వెల్లడి
  • మరో మూడు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 

మరో మూడు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయేవి తన చివరి ఎన్నికలు అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తానని తెలిపారు. అయితే రిటైర్ మెంట్ తర్వాత కూడా రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు.

మరోవైపు కర్ణాటక బీజేపీ కీలక నేత, మాజీ సీఎం యడియూరప్ప కూడా ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయబోనని ఇటీవల ప్రకటించారు. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ప్రకటించారు. 

224 సీట్లు ఉన్న కర్ణాటక ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి మే 24న ముగుస్తుంది. ఆ లోపు ఎన్నికలు జరగనున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో అత్యధిక సీట్లను బీజేపీ దక్కించుకున్నా.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ రాలేదు. దీంతో జేడీఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ కూటమి ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడలేదు. బీజేపీ దెబ్బకు కూలిపోయింది. తర్వాత బీజేపీ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

  • Loading...

More Telugu News