Turkey: టర్కీ, సిరియా దేశాల్లో ఆగని ప్రకంపనలు... 6.0 తీవ్రతతో మూడో భూకంపం

Third earthquake hits Turkey and Syria

  • టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపాలు
  • 12 గంటల వ్యవధిలో 3 భూకంపాలు
  • బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
  • ముమ్మరంగా సహాయక చర్యలు
  • శిథిలాల కింద బయటపడుతున్న మృతదేహాలు

టర్కీ, సిరియా దేశాల్లో ఈ ఉదయం నుంచి వరుసగా భారీ భూకంపాలు సంభవిస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వేకువ జామున 7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించగా, మధ్యాహ్నం 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. తాజాగా 6.0 తీవ్రతతో మూడో భూకంపం వచ్చింది. ఈ భూకంప కేంద్రం సెంట్రల్ టర్కీలో ఉన్నట్టు గుర్తించారు. 

12 గంటల వ్యవధిలో మూడు భారీ భూకంపాలు సంభవించడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటిదాకా 1600 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, శిథిలాల కింద నుంచి ఇంకా వెలికితీత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య 5 వేలకు చేరొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. 

వరుస భూకంపాల నేపథ్యంలో టర్కీ, సిరియా దేశాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాల్లో భారీ ఎత్తున సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

  • Loading...

More Telugu News