syria: సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం.. ఇదిగో పసికందు!

mother dies after delivered baby under wreckage in syria

  • సిరియాలోని అలెప్పోలో కూలిన భవనంలో చిక్కుకుపోయిన గర్భవతి
  • శిథిలాల కిందే ప్రసవించి కన్నుమూత
  • పసికందును తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్

టర్కీ (తుర్కియే), సిరియాలో సంభవించిన పెను విపత్తు వేల మందిని బలి తీసుకుంది. లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది. కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వాళ్లు, తమ వాళ్లు ఏమయ్యారో తెలియక అల్లాడిపోతున్న వాళ్లు.. ఎటుచూసినా విషాదం, ఎవరిని కదిపినా కన్నీళ్లు. 

ఇంతటి విపత్తులో మరో హృదయ విదారకర ఘటన జరిగింది. నిండుచూలాలు.. కూలిన భవనంలో చిక్కుకుపోయింది. పురిటినొప్పులతో శిథిలాల కింద అల్లాడిపోయింది. బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ప్రసవం కాగానే కన్నుమూసింది. 

సిరియాలోని అలెప్పోలో జరిగిందీ ఘటన. శిథిలాలను తొలగిస్తున్నప్పుడు శిశువును గమనించారు స్థానికులు. ఎంత సేపు అయిందో ఏమో.. చలనం లేని స్థితిలో అమ్మ.. చలిలో వణుకుతున్న పసికందు కనిపించారు. వెంటనే పిల్లాడిని తీసుకుని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. శిథిలాల నుంచి చిన్నారిని బయటికి తీసుకొస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూపరులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. ‘దేవుడా కాపాడు’ అంటూ ఎంతో మంది కామెంట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News