WhatsApp: వాయిస్ మెస్సేజ్ లతో వాట్సాప్ స్టేటస్.. మరెన్నో కొత్త ఫీచర్లు

WhatsApp officially rolling out the ability to set voice messages as Status updates and other features
  • 30 సెకండ్ల నిడివి గల వాయిస్ మెస్సేజ్ లు పెట్టుకునే వీలు
  • స్టేటస్ ను ఎవరెవరు చూడాలో కూడా నిర్ణయించుకోవచ్చు
  • ఇష్టమైన వారి స్టేటస్ మిస్ కాకుండా ప్రొఫైల్ రింగ్ ఫీచర్
యూజర్ల నాడిని పట్టుకుని వాట్సాప్ ముందుకు వెళుతుంటుంది. ఇందుకు నిదర్శనంగా ఎప్పటికప్పుడు యూజర్లు మెచ్చే సదుపాయాలను (ఫీచర్లు) ప్రవేశపెడుతుంటుంది. వాట్సాప్ స్టేటస్ ను దాదాపు ప్రతి ఒక్కరూ ఫాలో అవుతుంటారు. దీని ద్వారా తమ ఇష్టాలు, అభిరుచులు, వ్యక్తిగత, సామాజిక విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు టెక్ట్స్, ఫొటోలు, వీడియోలను వాట్సాప్ స్టేటస్ కింద ట్యాగ్ చేసుకోవచ్చు. ఇక మీదట వాయిస్ మెస్సేజ్ లను సైతం స్టేటస్ కింద పెట్టుకోవచ్చు. అంతేకాదు వాట్సాప్ తన స్టేటస్ ఫీచర్ కు మరికొన్నింటిని జోడించింది. 

ప్రైవేటు
ఒకరి వాట్సాప్ స్టేటస్ ను వారి కాంటాక్ట్ లిస్ట్ లోని అందరూ చూడొచ్చు. కానీ, అందరూ కాకుండా, ఒకరు లేదంటే కొందరే చూడాలని అనుకుంటే.. అందుకు ప్రైవసీ సెట్టింగ్స్ లో మార్పులు చేసుకోవచ్చు.

వాయిస్ స్టేటస్
30 సెకండ్ల నిడివి ఉన్న వాయిస్ సందేశాలను రికార్డ్ చేసి వాట్సాప్ స్టేటస్ కింద పెట్టుకోవచ్చు. తమ మాటలతో సమర్థవంతంగా తమ అంతరంగాన్ని తెలియజేసేందుకు ఇది అనుకూలించనుంది. స్టేటస్ అప్ డేట్స్ కు ఎమోజీలతో స్పందించొచ్చు. 

స్టేటస్ ప్రొఫైల్ రింగ్స్
వాట్సాప్ లో మీకు ఇష్టమైన వ్యక్తి పెట్టే స్టేటస్ లు మిస్ కాకూడదని అనుకుంటుంటే.. అందుకు ప్రొఫైల్ రింగ్ వీలు కల్పిస్తుంది.

లింక్ ప్రివ్యూ
స్టేటస్ లో ఏదైనా యూఆర్ఎల్ లింక్ పేస్ట్ చేశారనుకోండి. అది స్టేటస్ గా వెళ్లడానికి ముందు ప్రివ్యూ చూసుకోవచ్చు.
WhatsApp
status
new features
voice message
profile ring

More Telugu News