OnePlus 11R: వన్ ప్లస్ 11ఆర్ విడుదల.. మధ్యస్థ ధరతో సర్ ప్రైజ్
- రెండు వేరియంట్లలో లభ్యం
- వీటి ధరలు రూ.39,999, రూ.44,999
- స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1 చిప్ సెట్
- ఈ నెల 28 నుంచి వన్ ప్లస్, అమెజాన్ పోర్టళ్లలో విక్రయాలు
వన్ ప్లస్ 11ఆర్ భారత వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఆశ్చర్యకరంగా దీని ధర రూ.39,999 నుంచి ప్రారంభమవుతుండడం గమనార్హం. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1 చిప్ సెట్, 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే తో ఈ ఫోన్ వస్తుంది. 120 హెర్జ్ రిఫ్రెష్ రేటు తోపాటు ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పనిచేస్తుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని 100 వాట్ చార్జర్ తో కేవలం 25 నిమిషాల్లో చార్జ్ చేసుకోవచ్చు.
వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతోపాటు 8 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెన్సార్ ఉంటాయి. వన్ ప్లస్ 11లో స్నాప్ డ్రాగన్ 2 చిప్ సెప్ ఉంటుంది. దాంతో పోలిస్తే 8 ప్లస్ జనరేషన్ 1 చిప్ సెట్ పనితీరులో పెద్దగా వ్యత్యాసం ఉండదు. ఫోన్ చివర్లో కర్వ్ డ్ గా ఉంటుంది. డాల్బీ ఆట్మాస్ సపోర్ట్ తో కూడిన డ్యుయల్ స్పీకర్ మరో ప్రత్యేకత. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.39,999. 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ.44,999. ఈ నెల 28 నుంచి అమెజాన్, వన్ ప్లస్ పోర్టళ్లలో విక్రయాలు మొదలవుతాయి.