Alla Ramakrishna Reddy: మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి చేదు అనుభవం

MLA Alla Ramakrishna faces protest from locals in his Mangalgiri constituency
  • ఉండవల్లిలో ఆర్కేకు చేదు అనుభవం
  • రాజధాని తరలింపుపై సమాధానం చెప్పాలని స్థానికుల డిమాండ్
  • రాజధాని ద్రోహి అంటూ ఆర్కేపై మండిపాటు
 మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కి చేదు అనుభవం ఎదురయింది. ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు ఆయన వచ్చారు. ఆ సమయంలో అక్కడ కొంతమంది గుమికూడి ఉన్నారు. వారంతా తన కోసమే వచ్చారని భావించిన ఆర్కే వారి ముందు కారు ఆపారు. అయితే, ఆర్కే ఊహించని విధంగా వారంతా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతి నుంచి రాజధాని తరలింపుపై సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాజధాని ద్రోహి అంటూ మండిపడ్డారు. దీంతో, ఆయన వెంటనే తన వాహనం ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్థానిక మహిళలు సైతం ఆర్కేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో నారా లోకేశ్ పై ఆర్కే విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Alla Ramakrishna Reddy
RK
YSR
Amaravati

More Telugu News