K Kavitha: పార్లమెంటు సాక్షిగా మోదీ అబద్ధాలు చెప్పారు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

Kavitha fires on Modi

  • అదానీ అంశంలో మోదీ జవాబు చెప్పలేదన్న కవిత
  • రైతులకు అందించే సాయంపై కూడా అబద్ధాలు చెప్పారని విమర్శ
  • అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్

ప్రధాని మోదీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. తన ప్రసంగంలో అదానీ అంశంపై మోదీ జవాబు చెప్పలేదని కవిత విమర్శించారు. హైదరాబాద్ లో మీడియాతో ఆమె మాట్లాడుతూ, జాతీయవాదం ముసుగులో మోదీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు అందించే సాయంపై కూడా మోదీ అబద్ధాలు మాట్లాడారని అన్నారు. 

11 కోట్ల మంది రైతులకు నగదు సాయం చేస్తున్నామని పార్లమెంటులో మోదీ చెప్పారని... వాస్తవానికి కేంద్రం కేవలం 3.87 కోట్ల మంది రైతులకు మాత్రమే సాయం చేస్తోందని అన్నారు. లబ్ధి పొందే రైతుల సంఖ్యను ప్రతి ఏటా తగ్గిస్తున్నారని దుయ్యబట్టారు. అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ భారీగా నష్టపోయిందని... అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని ఆమె డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News