Narendra Modi: ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వెళితే ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టిన చరిత్ర మీది: కాంగ్రెస్ పార్టీపై మోదీ ఫైర్

PM Modi targets Congress party in his speech at Rajya Sabha
  • రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం
  • కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు
  • కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 356ని దుర్వినియోగం చేసిందని వెల్లడి
  • ఇందిరాగాంధీ 50 సార్లు ప్రభుత్వాలను కూలదోశారని వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాజ్యసభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలకులు ఆర్టికల్ 356ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఇందిరాగాంధీ ఆర్టికల్ 356 సాయంతో 50 సార్లకు పైగా ప్రభుత్వాలను కూలదోశారని ఆరోపించారు. ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వెళితే ఆయన ప్రభుత్వాన్ని కూల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ధ్వజమెత్తారు. ఎంజీఆర్ వంటి దిగ్గజాల ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ అక్రమంగా పడగొట్టిందని మోదీ వివరించారు. 

కాంగ్రెస్ పాలకులు 600కి పైగా పథకాలకు గాంధీ, నెహ్రూ పేర్లు పెట్టారని విమర్శించారు. గాంధీ పేరు ఉన్న నేతలు ఇంటి పేరులో నెహ్రూ అని ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు.
Narendra Modi
Rajya Sabha
BJP
Congress
Parliament
India

More Telugu News