Hyderabad JNTU: ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ అంజిరెడ్డి మారెడ్డి

Prof Anji Reddy Mareddy Appointed as Andhra Kesari University VC
  • ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ గవర్నర్ 
  • ప్రస్తుతం హైదరాబాద్ జేఎన్‌టీయూలో ప్రొఫెసర్‌గా విధులు
  • త్వరలోనే బాధ్యతల స్వీకరణ
ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీకి కొత్త వైస్ చాన్సలర్‌ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్ అంజిరెడ్డి మారెడ్డి కొత్త వీసీగా నియమితులయ్యారు.

ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)లోని ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఇకపై ఆయన ఆంధ్రకేసరి యూనివర్సిటీ వీసీగా మూడేళ్ల పాటు వ్యవహరించనున్నారు. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. 

Hyderabad JNTU
Ongole
Andhra Kesari University
Prof Anji Reddy Mareddy

More Telugu News