KS Bharat: నాగపూర్ టెస్టులో నిరాశపరిచిన తెలుగు తేజం
- టీమిండియా, ఆసీస్ మధ్య తొలి టెస్టు
- ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన భరత్
- 8 పరుగులే చేసి అవుటైన వైనం
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగపూర్ లో తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఆస్ట్రేలియాను మొదటి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే కుప్పకూల్చిన టీమిండియా... ప్రస్తుతం కీలక ఆధిక్యం సంపాదించింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ ప్రస్తుతం 100 ఓవర్లలో 7 వికెట్లకు 287 పరుగులు చేసింది. భారత్ 110 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అయితే, ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తెలుగు తేజం కేఎస్ భరత్ స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ కావడంతో బరిలో దిగిన భరత్ 10 బంతులు ఆడి 8 పరుగులే చేశాడు. ఆస్ట్రేలియా యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ బౌలింగ్ లో భరత్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. టీమిండియా ఇన్నింగ్స్ లో ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.
ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా 57, అక్షర్ పటేల్ 27 పరుగులతో ఆడుతున్నారు. 22 ఏళ్ల ఆసీస్ కొత్త స్పిన్నర్ టాడ్ మర్ఫీ 5 వికెట్లు తీయడం విశేషం. మర్ఫీకి ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్.