Matt Kuhnemann: రెండో టెస్టు కోసం మరో కొత్త స్పిన్నర్ ను తీసుకువస్తున్న ఆసీస్

Australia set to introduce new spinner Matt Kuhnemann in second test
  • తొలి టెస్టులో టాడ్ మర్ఫీని ఆడించిన ఆసీస్
  • నాగపూర్ లో రెండున్నరోజుల్లోనే ముగిసిన టెస్టు
  • భారత్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని కంగారూల విలవిల
  • ఢిల్లీ టెస్టుకు మాట్ కుహ్నెమన్ ను ఎంపిక చేసిన ఆసీస్
నాగపూర్ టెస్టులో దారుణంగా రెండున్నర రోజుల్లోనే ఓడిపోయిన ఆస్ట్రేలియా, ఇప్పుడు రెండో టెస్టు కోసం మరో కొత్త స్పిన్నర్ ను తీసుకువస్తోంది. తొలి టెస్టులో ఆడిన ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ రాణించడం తెలిసిందే. ఇప్పుడు అతడికి తోడు ఎడమచేతివాటం స్పిన్నర్ మాట్ కుహ్నెమన్ ను రంగంలోకి దింపనుంది. కుహ్నెమన్ ఇప్పటిదాకా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. 

కుహ్నెమన్ ను జట్టులోకి తీసుకోవడంపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఓ ప్రకటన చేసింది. 

"లెగ్ స్పిన్నర్ మిచెల్ స్వెప్సన్ భార్య గర్భవతి. ఆమె కోసం స్వెప్సన్ స్వదేశానికి తిరిగి వెళుతున్నాడు. అతడి స్థానంలో కుహ్నెమన్ ను ఎంపిక చేశాం. ఈ టెస్టు సిరీస్ లోని మిగతా మ్యాచ్ లకు కుహ్నెమన్ అందుబాటులో ఉంటాడు" అంటూ ఆసీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలో జరిగే రెండో టెస్టులో సీనియర్ స్పిన్నర్ నాథన్ లైయన్, టాడ్ మర్ఫీలతో కలిసి కుహ్నెమన్ స్పిన్ బాధ్యతలు పంచుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
Matt Kuhnemann
Left Arm Spinner
Australia
2nd Test
New Delhi
Team India

More Telugu News