SEBI: అదానీ అంశంపై ఆర్థిక మంత్రికి సెబీ నివేదిక

SEBI to update FM Sitharaman on Adani probe this week Report
  • ఈ 15న ఆర్థిక మంత్రి సీతారామన్ తో సెబీ అధికారుల భేటీ
  • అదానీ గ్రూపు కంపెనీలపై సమాచారంతో నివేదిక 
  • తాము తీసుకున్న చర్యల వివరాల ప్రస్తావన
అదానీ గ్రూప్ వ్యాపార సంస్థలపై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ చేసిన ఆరోపణల నేపథ్యంలో.. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సెబీ ఈ వారంలోనే ఓ నివేదిక సమర్పించనుంది. అదానీ అంశంపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండడం తెలిసిందే. పార్లమెంటు ఉభయ సభలు కూడా ఇదే అంశంపై స్తంభనకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో సెబీ ఇచ్చే నివేదికకు ఎంతో ప్రాధాన్యం నెలకొంది. 

హిండెన్ బర్గ్ ఆరోపణలతో అదానీ షేర్లు పడిపోవడం తెలిసిందే. దీంతో అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎఫ్ పీవోని విరమించుకుంది. దీని పూర్వాపరాలపై సెబీ సమాచారం ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ నెల 15న సెబీ ఉన్నతాధికారుల బృందం ఆర్థిక మంత్రితో భేటీ కానుంది. ఇటీవల అదానీ గ్రూప్ షేర్ల పతనం సమయంలో తీసుకున్న అదనపు నిఘా చర్యల గురించి వివరించనున్నట్టు ఈ వ్యవహారం గురించి తెలిసిన వర్గాలు వెల్లడించాయి. అలాగే, విదేశాల్లో ఉన్న అదానీ గ్రూప్ ఆఫ్ షోర్ కంపెనీల నుంచి అదానీ గ్రూప్ సంస్థల్లోకి వచ్చిన నిధుల అంశంపైనా సెబీ వివరాలు సమర్పించనున్నట్టు తెలిపాయి.
SEBI
Gautam Adani
probe
report
Nirmala Sitharaman

More Telugu News