box office: రూ.1000 కోట్లకు చేరువైన ‘పఠాన్’

Pathaan crosses Rs 950 crore worldwide

  • 19 రోజుల్లోనే రూ.950 కోట్ల వసూళ్లు
  • గత నెల 25న విడుదలైన చిత్రం
  • షారుఖ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్

బాలీవుడ్ బడా హీరో షారుఖ్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ‘పఠాన్‌’చిత్రం ఆయన కెరీర్లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది. గత నెలలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల్ని సృష్టిస్తోంది. కేవలం 19 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 950 కోట్ల వసూళ్లను సాధించింది. వెయ్యి కోట్ల మార్కు అందుకునేందుకు చేరువైంది. రెండు వారాంతాలు పూర్తయినా బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా జోరు కొనసాగుతూనే ఉంది. ఈ ఆదివారం కూడా ఈ చిత్రం రూ. 12.50 కోట్లు రాబట్టింది.

భారత్‌తో పాటు విదేశాల్లోనూ ‘పఠాన్‌’ జోరు కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్ చేరనుంది. బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుఖ్‌ఖాన్‌ గూఢచారిగా నటించారు. దీపికా పదుకొణే, జాన్ అబ్రహం కీలక పాత్రలు పోషించారు.

  • Loading...

More Telugu News