Nadendla Manohar: ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు: నాదెండ్ల మనోహర్

Nadendla Manohar fires on YSRCP

  • బెదిరిస్తుంటే రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెడతారన్న నాదెండ్ల
  • మంత్రులకు శాఖలపై పట్టు ఉందా? అని ప్రశ్న
  • కేబినెట్ మీటింగ్ లో కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు చర్చించలేదన్న మనోహర్

విశాఖలో వైసీపీ ప్రభుత్వం నిర్వహించనున్న ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. తప్పుడు కేసులు పెడుతూ భయపెడుతుంటే రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులకు ఎవరికైనా తమ శాఖలపై పట్టు ఉందా? అని అడిగారు. 

ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. జిందాల్ సంస్థకు భూ కేటాయింపులపై వాస్తవాలను ఎందుకు వెల్లడించలేదని అడిగారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవలి కాలంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ రెండు సార్లు కలుసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News