Nara Lokesh: జగన్ రూ.10 లక్షలు ఇచ్చారు... నేను రూ.20 లక్షలు ఇస్తా... బాలికను తిరిగి తీసుకురాగలరా?: లోకేశ్

Lokesh challenges YCP govt
  • తాడేపల్లిలో బాలిక హత్య
  • రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్
  • బాలిక ప్రాణానికి విలువ కట్టారంటూ లోకేశ్ ఆగ్రహం
  • పరిహారం ఇచ్చి వదిలేశారంటూ విమర్శలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. పాదయాత్ర సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. తాడేపల్లిలో బాలిక హత్య నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక కుటుంబానికి అన్యాయం జరిగితే పరిహారం ఇచ్చి వదిలేశారని విమర్శించారు. బాలిక ప్రాణానికి జగన్ రూ.10 లక్షల విలువ కట్టారని మండిపడ్డారు. నేను రూ.20 లక్షలు ఇస్తా... బాలికను తిరిగి తీసుకొస్తారా? అని లోకేశ్ నిలదీశారు. 

ఇక, జగన్ అసమర్థతోనే పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని విమర్శించారు. జగన్ కక్ష సాధింపుల వల్ల అమరరాజా తెలంగాణకు వెళ్లిపోయిందని తెలిపారు. జగన్ నాలుగేళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. బయటకు రావాలంటే జగన్ కు పరదాలు కావాలని ఎద్దేవా చేశారు.
Nara Lokesh
Jagan
Girl
Tadepalli
Ex Gratia
TDP
YSRCP

More Telugu News