Godavari express: గోదావరి ఎక్స్​ప్రెస్​ పట్టాలు తప్పడంతో 7 రైళ్ల రద్దు

Cancellation and Partial Cancellation of Trains over Godavari express derails issue
  • మరో 12 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసిన దక్షిణ మధ్య రైల్వే
  • ఘట్ కేసర్ వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్
  • నాలుగు బోగీలను అక్కడే వదిలేసి వెళ్లిన గోదావరి ఎక్స్ ప్రెస్
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన సంగతి విదితమే. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ వద్ద నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతో రైలును నిలిపివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, ప్రమాదం కారణంగా పట్టాలు తప్పిన బోగీలను అక్కడే వదిలేసి మిగతా బోగీలతో రైలు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంది. బోగీలు నిలిచిపోయిన కారణంగా ఆ మార్గం మీదుగా ప్రయాణించే 7 రైళ్లను బుధవారం రద్దు చేసినట్టు, మరో 12 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

రద్దయిన రైళ్లు ఇవే
కాచిగూడ–నడికుడి 
నడికుడి–కాచిగూడ
సికింద్రాబాద్–వరంగల్
వరంగల్–హైదరాబాద్
గుంటూర్–సికింద్రాబాద్
సికింద్రాబాద్–రేపల్లె 
Godavari express
Train Accident
Cancellation
train
south central railway
derails

More Telugu News