Anasuya: నెటిజన్‌ కామెంట్‌కు అనసూయ ఆగ్రహం

Anasuya fires on netizen
  • వాలెంటైన్స్ డే సందర్భంగా భర్తతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన అనసూయ
  • వాడి దగ్గర డబ్బు ఉందన్న నెటిజెన్
  • చెప్పుతో కొడతా అన్న అనసూయ
సినీ నటి, బుల్లితెర హాట్ యాంకర్ మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన భర్తతో కలిసి దిగిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నీతో జీవితం క్రేజీగా, రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుందని ఫొటోకు ఆమె క్యాప్షన్ పెట్టింది. 

ఈ పోస్ట్ పై ఒక నెటిజెన్ విమర్శనాత్మకంగా స్పందిస్తూ... 'అంతలేదులే అక్కా... వాడి దగ్గర డబ్బు ఉంది అంతే' అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ పై అనసూయ మండిపడింది. ఎంతుందేంటి డబ్బు... నా దగ్గర లేదా? అని ప్రశ్నించింది. 'అందేంట్రా తమ్ముడూ బావగారిని వాడు, వీడు అనొచ్చా?' అని అడిగింది. 'ఏం పెంపకంరా నీది... చెంపలేసుకో... లేకపోతే నా చెప్పులతో నీ చెంపలేస్తా' అని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Anasuya
Tollywood
Valentines day

More Telugu News