Sensex: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 243 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 86 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 5.79 పాయింట్లు లాభపడ్డ టెక్ మహీంద్రా షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఒడిదుడుకుల్లో కొనసాగిన మార్కెట్లు చివర్లో లాభాల్లోకి వెళ్లాయి. రియాల్టీ, ఐటీ రంగ షేర్ల నుంచి మద్దతు లభించడంతో మార్కెట్లు లాభపడ్డాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 243 పాయింట్లు లాభపడి 61,275కి చేరుకుంది. నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 18,016 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (5.79%), రిలయన్స్ (2.22%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.44%), భారతి ఎయిల్ టెల్ (1.24%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.19%).
టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-1.22%), ఐటీసీ (-1.14%), సన్ ఫార్మా (-1.07%), ఎల్ అండ్ టీ (-0.63%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.62%).