Nara Lokesh: నారా లోకేశ్ 20వ రోజు పాదయాత్ర హైలైట్స్

Nara Lokesh padayatra high lights

  • సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగిన పాదయాత్ర
  • సంక్షేమ పథకాలు ఎలా కట్ చేయాలా అనేదే జగన్ ఆలోచన అని లోకేశ్ విమర్శ
  • జబర్దస్త్ ఆంటీ జగన్ మూతిపళ్లు రాలగొట్టాలని వ్యాఖ్య

టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈరోజు ఆయన 20వ రోజు పాదయాత్రను పూర్తి చేశారు. 20వ రోజు పాదయాత్ర పిచ్చాటూరు మండలం కీలపూడి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. పాదయాత్రకు బయలుదేరే ముందు ఎస్సీ సామాజికవర్గీయులతో యువనేత సమావేశమయ్యారు. 

పిచ్చాటూరులో ఆర్టీసీ బస్సు ఎక్కిన లోకేష్ ప్రయాణీకులను అడిగి ఛార్జీలపై ఆరా తీశారు. టీడీపీ ప్రభుత్వంలో ఆర్టీసి ఛార్జీలు... వైసీపీ పాలనలో ఆర్టీసీ ఛార్జీల మధ్య వ్యత్యాసాన్ని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. గత 3.8 ఏళ్లలో ఛార్జీలు విపరీతంగా పెంచి భారం మోపారని ప్రయాణీకులు తెలిపారు. ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత సిబ్బంది పడుతున్న ఇబ్బందుల గురించి కండక్టర్ ని అడిగి తెలుసుకున్నారు. లోకేశ్ పాదయాత్ర వెంకట్రెడ్డికండ్రిగ, కీలపూడి, రెప్పలపట్టు, పిచ్చాట్టూరు, గొల్లకండ్రిగ మీదుగా కొనసాగి రాయపేడులో ముగిసింది.

లోకేశ్ ప్రసంగాల్లోని హైలైట్స్:
  • కటింగ్ సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఎలా కట్ చేయాలా అని ఆలోచిస్తున్నాడు. 
  • 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని... దానికి మంగళం పలికాడు. 
  • నిబంధనల పేరుతో పెన్షన్లను తొలగించాడు. పెన్షన్ ఎలా తీయాలనేదే జగన్ ఆలోచన. 
  • దళతులు బాగుండాలనేదే చంద్రబాబు ఆలోచన. జగన్ దళిత ద్రోహి. 
  • దళితుల దగ్గర నుంచి వైసీపీ నేతలు బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. 
  • చంద్రబాబు సీఎం అయిన వెంటనే ప్రతి ఏటా జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. 
  • అమరావతి, కర్నూలు ప్రజలను జగన్ మోసం చేస్తున్నాడు. రాష్ట్రానికి విశాఖ మాత్రమే రాజధాని అని  మంత్రి బుగ్గన అన్నారు. కర్నూలుకు హైకోర్టు అని చెప్పారని... ఇప్పుడు కేవలం బెంచ్ మాత్రమే అని చెపుతున్నారు. 
  • మంత్రి రోజాకు చీర, గాజులు, పసుపు, కుంకుమ ఇచ్చేందుకు వెళ్లిన దళిత మహిళలను కొట్టారు. 
  • ఆధార్ మాదిరిగా సెల్ ఫోన్ కే క్యాస్ట్ సర్టిఫికెట్ వచ్చేలా చేస్తాం. 
  • జబర్దస్త్ ఆంటీ అవినీతిని ప్రశ్నిస్తే మహిళలను కించపరిచినట్టట. నా పళ్లు రాలగొడతానని బజర్దస్త్ ఆంటీ వార్నింగ్ ఇస్తోంది. ముందు జగన్ రెడ్డి పళ్లు రాలగొట్టండి. 

  • Loading...

More Telugu News