Nikhil Kamath: పెట్టుబడులన్నీ ఈక్విటీల్లోనే పెట్టేయవద్దు: 'జెరోధ' నిఖిల్ కామత్
- ఈక్విటీ వ్యాల్యూషన్లు ఖరీదుగా ఉన్నాయన్న జెరోదా అధినేత
- డెట్, బంగారం, రియల్ ఎస్టేట్ లో ఎక్కువ పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడి
- కరెక్షన్ వస్తే ఈక్విటీ వాటా పెంచుకుంటానన్న కామత్
రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీల పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవుతుంటారు. షేరు ధరలు స్వల్ప కాలంలోనే రెట్టింపు అవ్వడం వారిని కట్టిపడేస్తుంది. కానీ, ఈక్విటీ పెట్టుబడుల పరంగా జాగ్రత్తలు తెలిసిన వారు తక్కువ మందే. ప్రముఖ స్టాక్ బ్రోకరేజీ సంస్థ జెరోధ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ప్రస్తుత తరుణంలో పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఈక్విటీల్లో పెట్టేయడం సరికాదంటున్నారు. తాను సైతం ఈక్విటీలకు తక్కువ కేటాయింపులు చేసినట్టు చెప్పారు.