RRR: బంగారు భూగోళమా థాంక్యూ: చంద్రబోస్

 Chandrabose picks up his Goldenglobe award award

  • గోల్డెన్ గ్లోబ్ అవార్డు స్వీకరించిన గేయ రచయిత
  • నాటు నాటు పాటకు వరించిన ప్రఖ్యాత అవార్డు
  • ఆస్కార్ కు కూడా నామినేట్ అయిన నాటు నాటు

ఆర్ఆర్ ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మెప్పించింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాట అందరినీ ఉర్రూతలూగించింది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది. ఉత్తమ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా లభించింది. కాలిఫోర్నియాలో జరిగిన ప్రదానోత్సవంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. ఈ పాట రాసిన చంద్రబోస్ తాజాగా లాస్ ఏంజెల్స్ లోని గోల్డెన్ గ్లోబ్ కార్యాలయంలో ఈ అవార్డు స్వీకరించారు. ఈ విషయాన్ని గోల్డెన్ గ్లోబ్ అవార్స్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ప్రకటించింది. 

‘గోల్డెన్ గ్లోబ్ విన్నర్ చంద్రబోస్ మా కార్యాలయానికి వచ్చి నాటు నాటు పాటకు లభించిన పురస్కారాన్ని అందుకున్నారు. ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు’ అని పోస్ట్ చేసింది. ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో చంద్రబోస్ షేర్ చేశారు. ‘మనస్పూర్తిగా అందరికీ ధన్యవాదాలు. బంగారు భూగోళమా థాంక్యూ’ అని క్యాప్షన్ ఇచ్చారు. దాంతో, చంద్రబోస్ కు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘పట్టుకురండి చంద్రబోస్ గారు.. మన మణికొండకి.. మన అంజనీ గార్డెన్స్ కి.. మరోసారి శుభాభినందనలు మీకు’ అని మరో గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News