Pawan Kalyan: చిన్నారి మృతదేహంతో బైకుపై 120 కిమీ ప్రయాణం... తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
- చిన్నారికి చికిత్స కోసం విశాఖ వచ్చిన దంపతులు
- చికిత్స పొందుతూ చిన్నారి మృతి
- చిన్నారి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ నిరాకరణ
- కనికరం లేని పాషాణ ప్రభుత్వం ఇది అంటూ పవన్ ఫైర్
తమ చిన్నారికి చికిత్స కోసం అల్లూరి జిల్లాకు చెందిన దంపతులు విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి రాగా, చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందినట్టు తెలిసింది. స్వగ్రామానికి అంబులెన్స్ ఏర్పాటు చేయాలని చిన్నారి తల్లిదండ్రులు ప్రాధేయపడ్డారు. అయితే, వారికి అంబులెన్స్ నిరాకరించడంతో చిన్నారి మృతదేహంతో బైక్ పై 120 కిమీ ప్రయాణించాల్సి వచ్చింది.
దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో అమానవీయ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వని పాషాణ ప్రభుత్వం ఇది అంటూ విమర్శించారు. బిడ్డ మృతదేహంతో 120 కిమీ బైకుపై వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. ఆ గిరిజన దంపతులకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.