Vemulavada: వేములవాడకు వీఐపీలు.. సామాన్య భక్తులకు ఇబ్బందులు

Devotees protest against Vemulavada officials for halting darshans as vips visit the temple

  • వీఐపీల రాకతో వేములవాడలో దర్శనానికి పలుమార్లు బ్రేక్
  • క్యూలైన్లలో గంటల తరబడి నిలబడిపోతున్న సామాన్య భక్తులు
  • ఆలయ అధికారులపై భక్తుల నిరసన
  • ‘ఈఓ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు

మహాశివరాత్రి వేళ దైవదర్శనం కోసం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి సన్నిధికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రాజన్న దర్శనం కోసం రాత్రి 11 గంటల నుంచీ భక్తులు క్యూ లైన్లో నిలబడ్డారు. అయితే.. ఆలయ అధికారులు వీఐపీల కోసం సాధారణ భక్తులకు దర్శనాలు నిలిపివేయడంతో సామాన్య భక్తులు క్యూలైన్లలోనే వేచి చూడాల్సి వచ్చింది. 

సమయంతో సంబంధం లేకుండా వీఐపీలు వచ్చిన ప్రతిసారి అధికారులు దర్శనాలకు బ్రేక్ ఇస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. పిల్లలతో పాటూ క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూడాల్సి రావడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నుంచి స్పందన కరువవడంతో కొందరు ‘ఈఓ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News