Yogi Adityanath: అదే జరిగితే పాకిస్థాన్ ఇక ఉండదు: యోగి ఆదిత్యనాథ్

Yogi Adityanath says Pakistan will vanish when weapons made in Bundelkhand roar

  • ఉత్తరప్రదేశ్ లో రక్షణ కారిడార్ నిర్మిస్తున్నామన్న యూపీ సీఎం
  • ఇక్కడ తయారు చేసిన ఫిరంగులు గర్జిస్తే.. పాక్ గుండెల్లో వణుకు పుట్టడం ఖాయమని వ్యాఖ్య
  • ప్రపంచ పటం నుంచి పొరుగుదేశం అదృశ్యమవుతుందని ప్రకటన

ఉత్తరప్రదేశ్ లోని రక్షణ కారిడార్ విషయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్షణ కారిడార్ లో తయారు చేసిన ఫిరంగులు గర్జించడం మొదలుపెడితే.. పాకిస్థాన్ గుండెల్లో వణుకు పుట్టడం ఖాయమని అన్నారు. ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్ అదృశ్యమవుతుందని చెప్పారు.

బుందేల్ ఖండ్ రీజియన్ లోని బాందాలో నిర్వహించిన కలింజార్ మహోత్సవ ప్రారంభ వేడుకల్లో యోగి మాట్లాడారు. ‘‘డిఫెన్స్ కారిడార్ నిర్మితమవుతోంది. అక్కడి ఫిరంగులు గర్జించినప్పుడు.. పాకిస్థాన్ దానంతట అదే అదృశ్యమవుతుంది’’ అని చెప్పారు. 

ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ (యూపీడీఐసీ) అభివృద్ధి కోసం ఆగ్రా, అలీగఢ్, చిత్రకూట్, ఝాన్సీ, కాన్పూర్, లక్నోను ఎంపిక చేశారు. ఇందులో ఝాన్సీ, చత్రకూట్.. బుందేల్ ఖండ్ ఉన్నాయి. “బుందేల్‌ఖండ్‌ను అభివృద్ధి చేసేందుకు.. ఢిల్లీ, లక్నోకు ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాం. ఇప్పుడు మీరు చిత్రకూట్ నుంచి ఢిల్లీకి కేవలం ఐదున్నర గంటల్లో ప్రయాణించవచ్చు. చిత్రకూట్‌లో విమానాశ్రయం కూడా నిర్మించబోతున్నాం’’ అని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.

  • Loading...

More Telugu News