Australia: దూకుడుగా ఆడుతున్న ఆసీస్... ఢిల్లీ టెస్టులో ముగిసిన రెండో రోజు ఆట

Australia counter attack after losing 1st wicket in second innings

  • ఆసక్తికరంగా ఢిల్లీ టెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులు చేసిన ఆసీస్
  • 262 పరుగులు చేసిన భారత్
  • రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 61/1

ఢిల్లీ టెస్టు రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. టీమిండియాపై తొలి ఇన్నింగ్స్ లో ఒక పరుగు ఆధిక్యం పొందిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో దూకుడుగా ఆడేందుకు ప్రాధాన్యమిచ్చింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ జట్టు 12 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. 

ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 6 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో అవుట్ కాగా, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ తో కలిసి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. హెడ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 39 పరుగులు చేయగా, లబుషేన్ 19 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 62 పరుగులు కాగా... రేపటి ఆటలో ఆసీస్ ను టీమిండియా ఎంత త్వరగా ఆలౌట్ చేస్తే అంత మంచిది. 

ఈ పిచ్ పై బ్యాటింగ్ నానాటికి కష్టసాధ్యంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, లక్ష్యఛేదన ఏమంత సులువు కాదు. ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులు చేయగా, టీమిండియా 262 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News