Raghu Rama Krishna Raju: చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం ఉందంటూ ప్రధాని మోదీకి లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

MP Raghu Rama Krishna Raju wrote PM Narendra Modi
  • బలభద్రపురంలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు
  • చీకట్లోనే నడిచి అనపర్తి చేరుకున్న చంద్రబాబు
  • పోలీసుల వైఖరిని లేఖలో ప్రధానికి వివరించిన రఘురామ
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. నిన్న చంద్రబాబు పర్యటనలో జరిగిన పరిణామాలను రఘురామ ప్రస్తావించారు. పోలీసుల వైఖరిని ప్రత్యేకంగా వివరించారు. చంద్రబాబుకు అనేక అడ్డంకులు సృష్టించారని తెలిపారు. దీనిపై తగిన విధంగా స్పందించాలని కోరారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న అనపర్తి సభలో పాల్గొనేందుకు వస్తుండగా, పోలీసులు అడ్డుకోవడంతో కాలినడకన బయల్దేరారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ రాత్రివేళ లైట్లు లేని పరిస్థితుల్లో ఆయన బలభద్రపురం నుంచి అనపర్తి వరకు నడిచి రావడం పార్టీ వర్గాలను ఆందోళనలో ముంచెత్తింది.
Raghu Rama Krishna Raju
Narendra Modi
Letter
Chandrababu
TDP
YSRCP

More Telugu News