Chandrababu: తారకరత్న మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన చంద్రబాబు

Chandrababu says he was shocked to know the demise of Tarakaratna
  • మృత్యువుతో పోరాడి ఓడిన తారకరత్న
  • ఎంతో బాధగా ఉందన్న చంద్రబాబు
  • ప్రార్థనలు, ప్రయత్నాలు ఫలించలేదని తీవ్ర విచారం
  • ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థిస్తున్నట్టు వెల్లడి
గత కొన్నివారాలుగా మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న ఓడిపోయారు. తీవ్ర గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ పరిణామంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నందమూరి తారకరత్న మరణవార్త ఎంతో బాధను కలిగించిందని వెల్లడించారు. తారకరత్నను బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబసభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదని తీవ్ర విచారన్ని వ్యక్తం చేశారు.

"23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న, చివరికి మాకు దూరమై మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Chandrababu
Tarakaratna
Demise
TDP
Nandamuri Family

More Telugu News