Vijayasai Reddy: ఆరోగ్యంగా తిరిగొస్తాడని అనుకున్నాం... కానీ..!: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy condolences to the demise of Tarakaratna
  • నందమూరి తారకరత్న కన్నుమూత
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి
  • విధి మరోలా తలచిందని వెల్లడి
నందమూరి తారకరత్న మృతి పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి విజయసాయిరెడ్డి బంధువు అని తెలిసిందే. తారకరత్న సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నామని విజయసాయి వెల్లడించారు. కానీ విధి మరోలా తలచిందని విచారం వ్యక్తం చేశారు. 

నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నానంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. తారకరత్న అభిమానులకు ప్రగాఢ సానభూతి తెలియజేస్తున్నట్టు వెల్లడించారు.
Vijayasai Reddy
Tarakaratna
Demise
Alekhya Reddy

More Telugu News