Nara Lokesh: నిలిచిపోయిన యువగళం పాదయాత్ర... రేపు హైదరాబాదుకు లోకేశ్

Lokesh Yuva Galam Padayatra stopped after Tarakaratna demise
  • గత నెల 27న తారకరత్నకు తీవ్ర గుండెపోటు
  • 23 రోజులుగా నారాయణ హృదయాలయలో చికిత్స
  • నేడు కన్నుమూత
  • నందమూరి, నారా కుటుంబాల్లో విషాదం
తార‌క‌ర‌త్న మృతితో నందమూరి, నారా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గత మూడు వారాలుగా బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల వేదన వర్ణనాతీతం. 

కాగా, తారకరత్న మృతి నేపథ్యంలో, టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిలిచిపోయింది. తార‌క‌ర‌త్న‌కి నివాళులు అర్పించేందుకు లోకేశ్ రేపు ఉదయం హైద‌రాబాద్ బ‌య‌లుదేరనున్నారు. 

ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజవకర్గంలో కొనసాగుతోంది. వాస్తవానికి ఇవాళ శివరాత్రి సందర్భంగా లోకేశ్ పాదయాత్రకు విరామం ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం రేపు మళ్లీ యాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే లోకేశ్ హైదరాబాద్ వెళుతున్నందున, పాదయాత్ర మళ్లీ ఎప్పుడు కొనసాగేది ప్రకటించనున్నారు.
Nara Lokesh
Yuva Galam Padayatra
Tarakaratna
Demise
TDP
Hyderabad
Andhra Pradesh

More Telugu News