Pawan Kalyan: ఆశలు నెరవేరకుండానే తారకరత్న తుదిశ్వాస విడవడం దురదృష్టకరం: పవన్ కల్యాణ్

Pawan Kalyan deeply saddened to the demise of Tarakaratna
  • నందమూరి తారకరత్న కన్నుమూత
  • తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు
  • తారకరత్న కోలుకుంటాడని భావించినట్టు పవన్ వెల్లడి
నటుడు నందమూరి తారకరత్న కన్నుమూయడం బాధాకరం అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. గత మూడు వారాలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న కోలుకుంటారని భావించానని పవన్ వెల్లడించారు. 

నటుడిగా రాణిస్తూనే, ప్రజా జీవితంలో ఉండాలని తారకరత్న కోరుకున్నారని, కానీ ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తారకరత్న భార్యాబిడ్డలకు, తండ్రి మోహనకృష్ణ గారికి, బాబాయి బాలకృష్ణకు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో వివరించారు.

తీవ్ర విచారానికి లోనయ్యాను: చిరంజీవి

తారకరత్న మృతి పట్ల అగ్రహీరో చిరంజీవి స్పందించారు. నందమూరి తారకరత్న అకాలమరణం గురించి తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యానని వెల్లడించారు. ఎంతో ప్రతిభ, ఉజ్వల భవిష్యత్తు ఉన్న, అనురాగశీలి అయిన యువకుడు తారకరత్న ఇంత త్వరగా వెళ్లిపోవడం కలచివేస్తోందని చిరంజీవి తెలిపారు. 

తారకరత్న కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని వెల్లడించారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
Pawan Kalyan
Tarakaratna
Demise
Tollywood

More Telugu News