Tarakaratna: తారకరత్న భౌతికకాయానికి సోమవారం అంత్యక్రియలు

Tarakaratna last rites will be performed tomorrow
  • కుప్పంలో గుండెపోటుకు గురైన తారకరత్న
  • గత 23 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స
  • పరిస్థితి విషమించి కన్నుమూత
తెలుగు సినీ నటుడు నందమూరి తారకరత్న గత నెల 27న తీవ్ర గుండెపోటుకు గురై, గత 23 రోజులుగా చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. తారకరత్న భౌతిక కాయం ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో ఆయన నివాసానికి చేరుకోనుంది. 

సోమవారం ఉదయం ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం చాంబర్‌కు తరలిస్తారు. అభిమానుల సందర్శనార్థం అక్కడ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంచుతారు. ఐదు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Tarakaratna
Demise
Last Rites
Hyderabad

More Telugu News